Home తాజా వార్తలు ధమాకా ఆఫర్లను ప్రకటించిన అమెజాన్ – ఫ్లిప్ కార్ట్

ధమాకా ఆఫర్లను ప్రకటించిన అమెజాన్ – ఫ్లిప్ కార్ట్

Flipkart Big Billion Days vs Amazon Great Indian Festival sale

హైదబాద్: దసరా పండుగ పురస్కారించుకొని ఈ-కామర్స్ దిగ్గజ వెబ్‌సైట్స్ ప్రత్యేక అమ్మకాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ బుధవారం ప్రారంభించగా… ఫ్లిప్‌కార్ట్ కూడా తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఈ రోజే ప్రారంభించింది. ఈ సేల్ అక్టోబర్ 14వ తేదీ వరకు ఉండగా… ఇందులో అనేక రకాల ఉత్పత్తులపై కస్టమర్లకు కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తున్నాయి ఈ కామర్స్ వైబ్ సైట్స్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఇఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఉన్న ప్రొడక్ట్స్…

యాపిల్ ఐఫోన్ X 64 జిబి ధర రూ.69,999 (రూ.21,901 తగ్గింపు), హువావే పి20 ప్రొ – రూ.54,999 (రూ.10వేలు డిస్కౌంట్),  శాంసంగ్ గెలాక్సీ ఎస్9 64 జిబి రూ.42,990 (రూ.14,910 డిస్కౌంట్), వన్‌ప్లస్ 6 6జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ – రూ.29,999 (రూ.5వేల తగ్గింపు), హానర్ ప్లే 4జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ – రూ.18,999 (రూ.1వేయి తగ్గింపు, అమెజాన్ పే రూ.1వేయి క్యాష్‌బ్యాక్), షియోమీ ఎంఐ ఎ2 – రూ.14,999 (రూ.2వేల తగ్గింపు) , షియోమీ రెడ్‌మీ వై2 4జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ – రూ.10,999 (రూ.1వేయి తగ్గింపు)  షియోమీ రెడ్‌మీ వై2 3 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ – రూ.8,999 (రూ.1వేయి తగ్గింపు) అమెజాన్ ఎకో ప్లస్ (2వ జనరేషన్) – రూ.11,999 (రూ.3వేల తగ్గింపు)  అమెజాన్ ఎకో- రూ.6,999 (రూ.2వేల తగ్గింపు)  అమెజాన్ ఎకో డాట్ (3వ జనరేషన్) – రూ.2,999 (రూ.1500 తగ్గింపు)  అమెజాన్ ఫైర్ టివి స్టిక్ – రూ.2,799 రూ.1200 తగ్గింపు లభిస్తోంది.

వీటితోపాటు అమెజాన్ అందిస్తున్న ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై రూ.55వేల తగ్గింపును అందిస్తోంది. కెమెరాలపై 35 శాతం, హెడ్‌ఫోన్స్‌పై 60 శాతం, స్పీకర్లపై 50 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. రూ.6వేలకు పైబడిన ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే, అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్. పలు ప్రొడక్ట్స్‌పై నో కాస్ట్ ఇఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది. ఎస్‌బిఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ.6వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తున్నారు. యాపిల్, వన్‌ప్లస్, షియోమీ, శాంసంగ్, హువావే, హానర్, నోకియా, మోటోరోలా, ఒప్పో, వివొ వంటి స్మార్ట్ ఫోన్లకు గాను 1 ఇయర్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ వంటి అద్భుత ఆఫర్‌ను అందిస్తోంది అమెజాన్.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు…

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఐటమ్స్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ తదితర అనేక రకాల ప్రొడక్ట్స్‌పై కస్టమర్లను ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నారు.  ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ 10 నుంచి 14 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2018 జరగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లే ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డే అమ్మకాల్లో టివిలు, ఫర్నిచర్, స్మార్ట్ పరికరాలతో పాటు, గాడ్జెట్స్ వంటి ఎన్నో ఎలక్ట్రానిక్స్ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లపై అక్టోబర్ 10 నుండి రాత్రి 9 వరకు వస్తువులు విక్రయించబడతాయని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.

ఫ్లిప్ కార్ట్ మొదటిసారి షియోమి స్మార్ట్ టివిలు తగ్గింపు ధరలకే వీటిని అందిస్తోంది. వీటితో పాటు శామ్ శాంగ్, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీల నుంచి ఎల్ఇడి టివిల్లో కూడా భారీగా డిస్కాంట్ లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ ఎప్పటికప్పుడు ఇఎమ్ ఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు విక్రయ సమయంలో ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఇతర ఆఫర్లను కూడా అందిస్తుంది.

స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలపై తగ్గింపులు….

రెడ్ మీ 5 ప్రో రూ..14,999 (రూ. 2000 తగ్గింపు), వివొ వినైన్ యూత్ రూ. 19,990 (రూ.6000 తగ్గింపు) హెచ్ ఎమ్ డి గ్లోబల్ యొక్క కొత్త నోకియా స్మార్ట్ ఫోన్ 5.1 ప్లస్ రూ.13,199 (రూ.2700 తగ్గింపు) నోకియా 6.1 ప్లస్ రూ. 17,600 (2600 తగ్గింపు) జెన్ ఫోన్ మాక్స్ ప్రో మి1 రూ.10,999 (రూ.1000 తగ్గింపు. జెన్ ఫోన్ 5జెడ్ రూ. 29,999 (రూ.5000 తగ్గింపు లభిస్తోంది.

Flipkart Big Billion Days vs Amazon Great Indian Festival sale