Home బిజినెస్ ఫ్లిప్‌కార్ట్ భారీ ఒప్పందం

ఫ్లిప్‌కార్ట్ భారీ ఒప్పందం

టెన్సెంట్, మైక్రోసాఫ్ట్, ఇబే నుంచి 1.4 బిలియన్ డాలర్ల సేకరణ, డీల్‌లో భాగంగా ఇబే సంస్థ కొనుగోలు

FlipCart

న్యూఢిల్లీ : దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ గా1.4 బిలియన్ డాలర్ల మేరకు నిధులను సేకరించింది. టెన్సెంట్ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్ కార్ప్, ఇబే సంస్థల నుంచి ఈ నిధులను సేకరించినట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా మార్కెట్‌లో గట్టి పోటీనిస్తున్న ప్రత్యర్థి సంస్థ అమెజాన్‌కు చెక్ పెట్టనుంది. 2015 సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ విలువ 15 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం ఇది 23 శాతం క్షీణించి 11.6 బిలి యన్ డాలర్లకు చేరింది.

సంస్థ విలువ పడిపోతున్న నేప థ్యంలో కంపెనీ నిధుల సేకరణ వేటలో పడింది. అంచ నాలకు అనుగుణంగానే మెగా డీల్ సాధించింది. ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఇబేను కూడా కొనుగోలు చేసింది. ఇటీవల భారీగా నిధుల సమీకరణను చేపట్టబోతోందన్న ఊహాగాలను తెరదించుతూ ఫ్లిప్ కార్ట్ ఈ మెగాడీల్ వివరాలను సోమవారం ప్రకటించింది. టెన్సెంట్, ఇబే, మైక్రెసాఫ్ట్‌లతో ఒప్పందం దేశీయ ఇ-కామర్స్ వ్యాపారం లో ఇది అతిపెద్దది అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇబే సంస్థ భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఇ-కామర్స్ మార్కెట్ వాటాపై దృష్టిపెట్టింది. ఈ సమయంలో ఇబే భారత్‌లోని వ్యాపారాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించడం ద్వారా భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది.

చైనాకి చెందిన టెన్సెంట్, ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఇబే నుంచి సుమారు 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించిన ఫ్లిప్‌కార్ట్ ఇంకా పలు వ్యూహాలను అమలు చేసే పనిలో ఉంది. టెన్సెంట్ వ్యూహాత్మకంగా భాగస్వామిగా, ఇబే ఫ్లిప్‌కార్ట్‌లో స్వతంత్ర సంస్థగా కొనసాగనుంది.

దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సహా ఇబే, టెన్సెంట్ కంపెనీలు తమ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావ డం పట్ల ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు ఆనందాన్ని వ్యక్తం చేశా రు. టెక్నాలజీ ద్వారా దేశీయ వాణిజ్య రంగ దిశను మార్చాలన్న తమ అభిలాష ఈ ఒప్పందం ద్వారా నెరవేర నుందని చెప్పారు. తాజా ఒప్పందంతో చైనాలో ఇంటర్నెట్‌కు సంబంధించిన సేవలను టెన్‌సెంట్ భారత్‌లో ఈ కామర్స్, చెల్లింపుల విధానంలో పాలు పంచుకునేందుకు అవకాశం లభించింది. ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు మంచి సర్వీస్‌ను అందించడంలో సాయం అందిస్తామని కంపెనీ అధినేత మార్టిన్ లా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

తమతో సరికొత్త ఆవిష్కరణల సంస్థలు జత కలవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఇది ఎంతో కీలకమైన ఒప్పందమని సంస్థ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్స్‌ల్ ప్రకటించారు. కాగా 2007లో ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ 100 మిలియన్ల వినియోగదారులను కల్గి ఉంది.

ఇదే సమయంలో మరో ఆన్‌లైన్ దిగ్గజం స్నాప్‌డీల్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకోనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు ఈ దిశ గా అడుగులు వేస్తున్నాయని సమాచారం. అమెజాన్ వం టి దిగ్గజ ఇ-కామర్స్ సంస్థలను ఢీకొనాలంటే విలీనమే పరిష్కారమని ఈ కంపెనీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఈ రెండు ఆన్‌లైన్ సంస్థల విలీనాకి గాను జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ సహకారం అందిస్తోంది.

ప్రైమరీ, సెకండరీ వాటాలను చేజిక్కించుకోవడం ద్వారా ఈ విలీన సంస్థలో 1.5 బిలియన్ డాలర్లు సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్ చేయనుందని సమాచారం. ఇది 15 శాతం వాటా ఉంటుందని పేర్కొంది. ఈ డీల్‌లో భాగంగా 1 బిలియన్ డాలర్ల షేర్ల విక్రయం ఉంటుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసిన అమెరికా సంస్థ టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌తో స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహాల్ సమావేశం కూడా నిర్వహించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇవి నిరాధారమని స్నాప్ డీల్ కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే ఈ రెండు దేశీయ సంస్థలూ ఇటీవలి కాలంలో నిధుల సమీకరణకు నానా అవస్థలూ పడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకు నేందుకు ఉద్యోగులను తొలగించడం, విస్తరణ ప్రణాళికలను వాయిదా వేసుకోవడం చేస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఏదో ఒకదానిలో విలీనానికి స్నాప్‌డీల్ సుముఖంగా ఉందని ఇటీవల వార్తలు హల్ చల్ చేశాయి. ఇవి నిరాధారమైనవని, కంపెనీ లాభాల వైపు పురోగమి స్తోందని స్నాప్‌డీల్ వర్గాలు ఖండిచాయి. అదే సమయంలో స్నాప్‌డీల్ ప్రతినిధులు మాత్రం ఎప్పుడు ఏ జరుగనుందో తాము చెప్పలేమని, పరిస్థితుల్లో అప్పటికప్పుడు మార్పు చోటుచేసుకోవచ్చని అన్నారు.