Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ షాపింగ్ డేస్ సేల్’

Flipkart Big Shopping Days from May 13 to 16 with Unbelievable Discounts

ముంబయి: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో మెగా సేల్ ను తీసుకువస్తోంది. ఈ నెల 13 నుంచి 16 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ పేరిట ఈ సేల్ ఉండనుంది. ఈ  4 రోజుల పాటు భారీ డిస్కౌంట్స్‌తో అమ్మకాలు జరపనున్నట్లు సంస్థ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టివిలతో పాటు ఇతర వస్తువులపై భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నది. అలాగే కొన్ని ఎంపిక చేసిన మొబైల్స్‌పై ఫ్లాష్‌సేల్‌ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అంతేగాక  నో కాస్ట్ ఇఎంఐ ఆఫర్ ను బ్యాంకు క్రెడిట్ కార్డులు, బజాజ్ కార్డులపై అందిస్తోంది. డెబిట్ కార్డులపై ‘బై నౌ పే లేటర్’ అవకాశం కల్పించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. వీటితో పాటు ఈసారి గేమ్స్ కార్నర్‌ను కొత్తగా పరిచయం చేసింది. దీని ద్వారా చిన్న ఆటను ప్లే చేయడం ద్వారా ల్యాప్ టాప్ లు, మొబైల్స్ ను కేవలం రూపాయికే సొంతం చేసుకోవచ్చు. బిగ్ షాపింగ్ డేస్ రోజున కొన్న వాటిపై 100 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కస్టమర్లకు సూచించింది.

Comments

comments