Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. 499కే మోటో స్మార్ట్‌ఫోన్

Moto-C-plus

‘మోటో సీ ప్లప్’ పేరుతో ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ మోటోరోలా ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఫ్లిప్‌కార్ట్ ద్వారానే సంస్థ విక్రయిస్తోంది. దీని ధర రూ. 6,999గా నిర్ణయించింది సంస్థ. ప్రస్తుతం ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ అత్యంత చౌకగా రూ. 499కే విక్రయిస్తోంది. అది ఎక్సేంజ్ ఆఫర్‌లో మాత్రమే. మూడు వేరియంట్లలో మోటో సి ప్లస్ అందుబాటులో ఉంది. అయితే ఎక్సేంజ్ చేసే స్మార్ట్‌ఫోన్‌ను బట్టి ఈ ఆఫర్ అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

‘మోటో సి ప్లస్’ ఫీచర్లు ఇలా ఉన్నాయి…
1) 5 ఇంచుల హెచ్‌డి తాకే తెర(720×1280 రిజల్యూజన్‌తో)
2) 2జిబి ర్యామ్, 16 జిబి అంతర్గత మెమొరీ(128 జిబి వరకు విస్తరించుకునే సదుపాయం)
3) 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
4) 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
5) ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
6) 4000 ఎంఎహెచ్ బ్యాటరీ
7) డ్యూయల్ సిమ్

Comments

comments