Home తాజా వార్తలు మళ్లీ వచ్చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ షాపింగ్ డేస్ సేల్…

మళ్లీ వచ్చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ షాపింగ్ డేస్ సేల్…

Flipkart Big Shopping Daysఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. ఈ నెల 6న ప్రారంభమయ్యే ఈ సేల్ ఈ నెల 8 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. దీనిలో భాగంగా స్మార్ట్‌ఫోన‍్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే టివిలు, ల్యాప్‌టాప్స్, గ్యాడ్జెట్స్‌లపై ఏకంగా 70శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ‘2018 అత్యల్ప ధరలు’ ఇవే అని  ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఇఎంఐ సదుపాయం ఉంది. దీంతో పాటు పోకో ఎఫ్1, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్, రియల్ మి సి1, అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1, హానర్ 9ఎన్, రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.

పిక్సెల్ 2ఎక్స్ఎల్: అసలు ధర రూ.45,499. కాగా, 5 వేల తగ్గింపుతో ఈ ఫోన్‌  రూ.39,999కు లభ్యమవుతోంది.
షావోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రో: ప్రారంభ ధర రూ.13,999, రెడ్‌మీ నోట్ 5 ప్రో: అసలు ధర రూ.13,999. ఆఫర్‌ ధర రూ.12,999, రియల్‌మీ సీ1: 2 జీబీ+16 జీబీ అసలు ధర రూ.7,999. సేల్‌లో రూ.500 తగ్గింపుతో లభిస్తుంది. నోకియా 5.1 ప్లస్: 3జీబీ+32జీబీ ధర రూ.10,999. ఆఫర్‌లో రూ.9,999 ధరకే లభ్యం. మోటోరోలా వన్ పవర్: అసలు దర రూ.15,999. ఆఫర్‌లో రూ.1,000 తగ్గింపుతో రూ.14,999కు  అందుబాటులో ఉంది. ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1: రూ.2000 డిస్కౌంట్‌తో రూ.4,999 ధరకే లభిస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 5: అసలు ధర రూ.9,999. ఆఫర్‌లో రూ.7,999 ధరకే లభిస్తుంది. నోకియా 6.1 ప్లస్: ఆఫర్ ధర రూ.14,999 అసలు ధర రూ.15,999
పిక్సెల్ 2ఎక్స్ఎల్:  ఆఫర్ ధర రూ.39,999, అసలు ధర రూ.45,499. హానర్‌ 10 : 24,999 ధర వద్ద లభ్యం.