Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 8పై ఆఫర్

I-Phone-8

న్యూఢిల్లీ: యాపిల్ ఫోన్లకు ఇకామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌ను అందిస్తోంది. తాజాగా ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌లకు భారత్‌లో ప్రీబుకింగ్స్ మొదలవగానే అమెజాన్, జియో సంస్థలు ఆఫర్లు ప్రకటించగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా ఆఫర్లతో ముందుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ కింద ఐఫోన్ 8 మోడల్ రూ.31,100 పొందే అవకాశముంది. అలాగే ఐఫోన్ 8 ప్లస్ రూ.40,100కే పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రెండు ఆఫర్లను వాడుకుంటే ఐఫోన్ 8 ధర ఇంత భారీగా తగ్గుతుంది. ఐఫోన్ 8 వేరియంట్స్‌పై ఫ్లిప్‌కార్ట్ గరిష్ఠంగా రూ.23 వేల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. అంటే మీ దగ్గర ఇప్పటికే ఐఫోన్ 7 ఉంటే దానిని ఎక్స్‌చేంజ్ చేసుకున్నందుకుగాను రూ.20 వేల డిస్కౌంట్, ఐఫోన్ 7 ప్లస్‌కు రూ.23 వేల డిస్కౌంట్ వస్తుంది. దీంతో ఐఫోన్ 8 64 జిబి ధర రూ.64 వేల నుంచి రూ.41 వేలకు తగ్గనుండగా, పాత ఫోన్ పికప్ చార్జెస్ కింద అదనంగా వసూలు చేస్తారు. ఇక దీనిపై మరో పది వేల డిస్కౌంట్ అదనంగా లభించే చాన్స్ ఉంటుంది.

Comments

comments