Home బిజినెస్ ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ఆఫర్

ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ఆఫర్

Flipkart

న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గ జం ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సంద ర్భంగా సరికొత్త ఆఫర్‌ను ప్రకటిం చింది.‘సమ్మర్ షాపింగ్ డేస్’ అనే ప్రత్యేక ఆఫర్ మంగళ వారం నుంచి 4వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ట్యాబ్లెట్లపై ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రకటించింది. సామ్‌సంగ్ ఆన్ ఎన్‌ఎక్స్‌టి 32జిబి వేరియంట్ మోడల్ ధర రూ.18,490 నుంచి రూ.14,900కు తగ్గించింది.

మోటో ఎక్స్ ప్లే ఫోన్స్ పై కూడా భారీగానే ఆఫర్లు ప్రకటించింది. మోటో ఎక్స్ ప్లే 16 జిబి అసలు ధర రూ.16,999 ఉండగా, రూ.11,999కి తగ్గించింది. అలాగే 32 జిబి మోడల్ అసలు ధర రూ.18,499 ఉండగా రూ.13,499 కే అంద జేస్తు న్నారు. అంతేకాకుండా, ఆపిల్ స్మార్ట్ వాచ్, సామ్‌సంగ్ గేర్, మోటో 360 స్పోరట్స్ మోడల్స్ పై, లెనోవా యోగా మోడల్ ట్యాబ్స్, ‘ఆపిల్’ ఐ ప్యాడ్స్‌పై కూడా ధరలను తగ్గించి, వినియోగదారులకు అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది