Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్ సేల్ ప్రారంభం…

Super-value-week

ముంబయి: ఈ-కామర్స్ దిగ్గజం ప్లిప్ కార్ట్ ‘సూపర్ వాల్యూ వీక్ పేరిట’ మరో ప్రత్యేకమైన సేల్‌ను మంగళవవారం ప్రారంభించింది. జూన్ 24వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగుతుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగా మెబైల్ ఫోన్లపై ఆఫర్లు, రాయితీలు కల్పిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్ సేల్‌లో పలు ఎలక్ట్రానిక్ వస్తులపై నో కాస్ట్ ఇఎంఐ, బైబ్యాక్ గ్యారంటీ, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను వినియోగదారులకు లభిస్తున్నాయి. గూగుల్ పిక్సల్ 2 ”128జిబి” ఫోన్‌పై రూ.199కే బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్‌ను కల్పిస్తున్నారు. అలాగే హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.8వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. అంతే కాకుండా రూ. 42వేల వరకు ఫోన్ ఎక్స్‌ఛేంజ్ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా మోటో ఎక్స్4 ఫోన్‌పై రూ.6,999 వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. అలాగే రూ.199 కి బై బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ.16వేల దాకా ఎక్స్‌ఛేంజ్ వాల్యూ ఆఫర్‌ లభిస్తుంది. వీటితో పాటు మోటో జి6 ప్లే, మోటో జడ్2 ఫోర్స్, రెడ్‌మీ నోట్ 5 ఫోన్లపై కూడా ఇదే తరహాలో ఆఫర్లను  ప్లిప్ కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది .

 

Comments

comments