Search
Thursday 15 November 2018
  • :
  • :

ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా నియామకాలు

Flipkart

న్యూఢిల్లీ: భారత్‌లో ఉన్న డిమాండ్ దృష్ట్యా ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాదిలో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నితిన్ సేథ్ ప్రకటించారు.

ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ తదితర సేవలను మరింత ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ తాజా నియామకాలు చేపట్టినట్లు ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం వెల్లడించింది.

ప్రస్తుతం ఎంపిక చేసే 1200 మందిని పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని నితిన్ సేత్ తెలిపారు. దీంతో సంస్థలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య 10,000లకు చేరుతోందన్నారు.

Comments

comments