Home జాతీయ వార్తలు ఒడిశాకు వరద ముప్పు

ఒడిశాకు వరద ముప్పు

Flooded

భువనేశ్వర్: వాయుగుండం ప్రేరిత భారీ వర్షాల కారణంగా ఒడిశా వరద ముప్పును ఎదుర్కొంటోంది. మహానది, వైతరణి నదులకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో ‘వరద ప్రభావిత ప్రజలను ఆదుకోడానికి పూర్తిగా సన్నద్ధంగా ఉండండి. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనడానికి మనం  సిద్ధంగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారులు, పత్రికా విలేకరులతో అన్నారు. ఒడిశాలో మూడురోజులుగా కురుస్తున్న వానలకు ప్రజలు నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లోని తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. జూలై 21 నుంచి 23 వరకు కురిసిన వానల కారణంగా ఒడిశా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. రాయగడలో ఇద్దరు, సంబల్‌పూర్‌లో ఇద్దరు, సుబర్ణపూర్‌లో ఒకరు, మల్కన్‌గిరి జిల్లా ల్లో  ఒకరు చొప్పున చనిపోయారు.

మహానది మైదాన ప్రాంతంలోని కటక్, కేంద్రపాడ, జాజ్‌పూర్, జగత్‌సింగ్‌పూర్, ఖుర్దా, పూరి కలెక్టర్లను ప్రత్యేక సహాయక చర్యల కమిషనర్(ఎస్‌ఆర్‌సి) బి.పి.సేథి అప్రమత్తం చేశారు. కాగా కటక్‌కు సమీపాన ఉండే ముందలి గేజ్ స్టేషన్ నుంచి దాదాపు 8,00,000 క్యుసెక్కుల నీటిని ఈ సాయంత్రం విడుల చేశారు. వైతరిణి నది వరద నీటి మట్టం కూడా పెరిగిపోతున్నందున కియోంఝర్, జాజ్‌పూర్,భద్రక్ జిల్లా కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు.  ఏ నది కట్టకు కూడా గండిపడలేదు. అయితే వరద నీటికి 3లక్షల మంది ప్రభావితం అయ్యారు.

సోమవారం మధ్యాహ్నానికి ముందలి నది నుంచి 7,30,877 క్యుసెక్కుల నీరు ప్రవహిస్తోంది. సోమవారం సాయంత్రానికి మరింత పెరిగొచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా ముందలి నది మైదానా ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో వరద ముప్పు పొంచి ఉంది. హీరాకుడ్ రిజర్వాయరు అధికారులు మంగళవారానికల్లా ఈ సీజన్ వరద నీటిని విడుదల చేయనున్నారు. మహానది నీటి వ్యవస్థ వరద నీటితో ప్రమాదకరంగా మారింది. హీరాకుడ్ రిజర్వాయరుకు 630 అడుగుల నీటిని నిల్వ చేసే సామ ర్థం ఉంది. అది, సోమవారం నాటికే 615.81 అడుగులకు చేరుకుంది. ఒడిశాను వరదలు ముంచెత్త ప్రమాద ఘంటికలు మోగుతున్నందున నీటి వనరుల శాఖ సం చార దళాలను(మొబైల్ టీమ్స్) తరలించింది. ఆదివా రం వానలు తగ్గుముఖం పట్టడంతో నీట మునిగిన కట క్, భువనేశ్వర్, పూరి ప్రాంతాలు తేరుకుంటున్నాయి.