Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

భారీ వర‌ద‌లు…49 మంది మృతి (వీడియో)

rain
కనో: నైజీరియాలో వరదల ధాటికి 49 మంది మృతిచెందారు. నైజీరియా సరిహద్దులోని జిబియాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే జిల్లాలోని 5 గ్రామాల పరిధిలో వరద నీరు పోటెత్తడంతో నది తీర ప్రాంతమంతా కొట్టుకుపోయింది. దీంతో ఆయా గ్రామాల్లో పలు ఇళ్లు ముంపునకు గురై 49 మంది చనిపోయారని కట్సినా అత్యవసర విభాగం వెల్లడించింది. ఆచూకీ లేని మరో 20 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వరద కారణంగా  2వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారని, బాధితులకు జిబియా కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఆశ్రయం కల్పించామని చెప్పారు. కొంత మంది బాధితులు కుప్పకూలిన ఇండ్ల అడుగుభాగంలో ఇరుక్కుపోయారని, వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించి వైద్యసేవలందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

https://www.youtube.com/watch?v=C70L1P85TWE

Comments

comments