Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

నాగార్జునసాగర్‌కు జలకళ

Nagarjunasagar-Project

నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తివేయడంతో లక్షా ముప్పై ఒక్క వేల క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. ఔట్ ఫ్లో 1350 క్యూసెక్కులుగా ఉంది. అంతేకాక కృష్ణానదికి వస్తున్న వరదలతో సాగర్‌కు మరింత ఇన్‌ఫ్లో పెరిగింది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 528.70 అడుగులకు చేరుకుంది. సాగర్‌కు భారీ వరదనీరు వస్తుండడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Flooding to Nagarjuna Sagar

Comments

comments