Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అర్ధరాత్రి వర్ష బీభత్సం

Rain-image

బస్తీలు, కాలనీలు జలమయం
ఇళ్లలోని చేరిన వరదనీరు.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు                                                                                                సెల్లార్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

మన తెలంగాణ/సిటీబ్యూరో: అర్థరాత్రి వేళ కురిసిన భారీ వర్షం నగరంలో బీభత్సం సృష్టించింది. శుక్రవారం అర్థరాత్రి మొదలైన వర్షం తెల్లవారు జాము వరకు ఎడతేరిపి లేకుండా కురు వడంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధనం కావడంతో పలు బస్తీలు, కాలనీల ఇళ్లలోకి భారీగా నీరు చేరాయి. ఎర్రగడ్డలో ప్రేమ్ నగర్ పూర్తిగా నీట మునగడంతో ఇళ్లలోకి నీరు చేరి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు నగర రహాదారులన్ని కాలువలను తలపించడం తో రాత్రి వేళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు ఆర్థరాత్రి కావ డం, మరో వైపు భారీ వర్షం కురువడంతో సహాయ చర్యలు అందక నగర వాసు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో వర్షానికి విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోవడంతో ఇళ్లల్లోకి చేరిన వరద నీరుతో అష్టకష్టాలు పడ్డారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 16 మి.మిల నుంచి 50 మి.మి.వరకు వర్షపాతంనమోదైంది. అంబర్‌పేట్ నారాయణగూడ, నాంపల్లి, లక్డీకాపూల్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు శివారు ప్రాంతాలైన ఎల్‌బినగ ర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లిలో కురిసిన భారీ వర్షం ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. జయానగర్‌లోని శ్రీమయూరి అపార్ట్‌మెంట్‌లో కారు పార్క్ చేసి అందులోనే గోపి అనే డ్రైవర్ కారులోనే నిద్రిస్తుండగా భారీ వర్షానికి సెల్లార్‌లో వరద నీరు చేరి పూర్తిగా నీట మునుగడంతో కారులోనే మరణించాడు.

మరో మూడు రోజుల పాటు వర్షాలు…
నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 3 రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారు లు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పాడిన ఉపరిత ఆవర్తనం కారణంగా శనివారం నుంచి సో మవారం వరకు రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపుతో పాటు ఈదరుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

Comments

comments