Home అంతర్జాతీయ వార్తలు చైనాలో వరదలు

చైనాలో వరదలు

china-floods

బీజింగ్ : చైనా ఈశాన్య ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద కారణంగా 10 మంది మృత్యువాత పడ్డారు. 71,300 మందిని సహాయక సిబ్బంది రక్షించింది. విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. చైనాలో అతి పెద్ద నది ఎల్లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎల్లో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం 7.3 బిలియన్ డాలర్లను కేటాయించింది.

 Floods in China : 10 People dead