Home అంతర్జాతీయ వార్తలు పాక్‌లో వరదలు : 164 మంది మృతి

పాక్‌లో వరదలు : 164 మంది మృతి

FLOODS-PAK

ఇస్లామాబాద్ : ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి పాక్‌లో వరదలు వచ్చి ఇప్పటి వరకు 164 మంది చనిపోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. సింధూ, పంజాబ్ ప్రావిన్సిస్‌లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని ఎన్‌డిఎంఎ వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వరదల వల్ల నిరాశ్రయులైన వారికి భోజన, తాత్కాలిక నివాస వసతి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

Floods in Pakistan: 164 killed