Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో వరదలు

అమెరికాలో వరదలు

TEKXASSటెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. టెక్సాస్, టోర్నడోన్, హూస్టన్ ప్రాంతాల్లో ఎక్కువగా వరద నీరు చేరింది. ఈ వర్షాలతో ఆరుగురు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. శనివారం ఉదయం ఏడు గంటలకు టోర్నడోస్ ప్రాంతంలో సుమారు 30 ఇళ్లు నీట మునిగాయి. మరో ఇంటి పైకప్పు కూలినట్టు అధికారులు తెలిపారు. హూస్టన్ అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.