Home అంతర్జాతీయ వార్తలు అమెరికాను వణికిస్తున్న ఫ్లోరెన్స్ హరికేన్

అమెరికాను వణికిస్తున్న ఫ్లోరెన్స్ హరికేన్

Hurricane-Florence

న్యూయార్క్: అమెరికాను ఫ్లోరెన్స్ హరికేన్ వణికిస్తోంది.  ఉత్తర కరోలినాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రెస్క్యూ సిబ్బంది వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్టు కరోలినా ప్రభుత్వం వెల్లడించింది. పలు ప్రాంతాలలో విద్యుత్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు.  65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలలు విరుచుకుపడుతున్నాయి. ఈ హరికేన్ ధాటికి ఇండ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఫ్లోరెన్స్ ధాటికి  70 మంది వరకు చనిపోయి ఉంటారని స్థానిక మీడియా బిబిసి వెల్లడించింది.

Florence Hurricane: Tropical Storm

Telangana news