Search
Friday 16 November 2018
  • :
  • :

అరుదైనవి

                     Parrot

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు అమెజాన్ ప్రాంతంలో అరుదైన నీలిరంగు చిలుకలను గుర్తించారు.  వీటిల్లో అనేక ప్రత్యేక లక్షణాలున్నాయి. పచ్చని చిలుకల కంటే ఇవి పెద్దగా అరుస్తాయట. అది కూడా ఒకేరకమైన శబ్దం చేస్తూ, పదే పదే హడావుడి చేస్తాయి. ఇవి చిన్న చిన్న గుంపులుగా జీవిస్తాయి. ఒక్కో గుంపులో 10 నుంచి 12 చిలుకలు ఉంటాయి. శాకాహారులైన ఈ పక్షులు పండ్లు, పువ్వులు, ఆకులు, విత్తనాలను ఇష్టంగా తింటాయని పరిశోధకులు తెలిపారు. వీటి మైటోకాండ్రియాలోని జన్యు క్రమాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సుమారు 1,20,000 సంవత్సరాల క్రితమే ఈ జాతి ఉద్భవించినట్లు వెల్లడించారు.

Comments

comments