Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సంస్థాగత బలోపేతంపై దృష్టి

kcr

*పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటేందుకు టిఆర్‌ఎస్ ప్రయత్నాలు
*రాష్ట్ర నేతలకు జిల్లా బాధ్యతలు

* నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఎమ్మెల్యేలు

*పార్టీ బలోపేతంపై కెసిఆర్ నజర్

మన తెలంగాణ/ఆసిఫాబాద్ :   పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార తెరాస  పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది. ఈ సంవత్సరం జరగబోవు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తచాటాలని  పార్టీ అధినేత రాష్ట్ర నేతలకు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సమాచారం, ప్రతిపక్ష పార్టీలు వివిధ అంశాలతో ప్రజల్లోకి వెళ్తూ ఆందోళనలు చేపడుతూ వారికి దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టడానికి  పార్టీని పటిష్టం చేయడమే ఏకైక మార్గమని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర కమిటిని ప్రకటించిన  పార్టీ అధినేత కేసిఆర్ జిల్లాలు, నియోజకవర్గ కమిటీలపై దృష్టిసారించారు. గతంలో జిల్లా కమిటిలు రాజకీయంగా క్రీయాశీల పాత్ర వహించేవారని, వాటిని పూర్తిగా రద్దుచేసి నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తలపెట్టారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా  పార్టీ నాయకత్వం సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారిస్తుంది. ముందుగా జరగబోవు సర్పంచ్, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో సత్తాచాటేందుకు ఇప్పటి నుండే గ్రామాల్లో సందడి నెలకొంది. త్వరలో ఎమ్మెల్యేలను నియోజకవర్గ ఇంచారీర్జిలుగా నియమించి నియోజకవర్గ కమిటీల పేర్లను సిద్ధంచేసి త్వరలోనే కమిటీ పేర్లను వెల్లడిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో  రెండు నియోజకవర్గాల్లో  పార్టీ  ఆదేశించిన దానికన్న ఎక్కువగానే సభ్యత్వ నమోదును చేపట్టారు. నియోజకవర్గ కమిటీలు త్వరలో రానున్న నేపథ్యంలో  ఆ కమిటిలను సమన్వయ పరుస్తూ జిల్లాలో  పార్టీ బలోపేతం చేయనున్నారు. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని  పార్టీ అధినేత రాష్ట్ర నేతలకు జిల్లా బాధ్యతలు నియమించారు. ఉమ్మడి జిల్లా  ఇంచార్జిగా నారదాసు లక్ష్మణ్‌ను, మంచిర్యాల జిల్లాకు రాష్ట్ర సహాయ కార్యదర్శి, సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు తెలంగాణ ఉద్యమ నేత , సీనియర్ నాయకురాలు మూల విజయరెడ్డి, ఆదిలాబాద్‌కు కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డిని , నిర్మల్ జిల్లాకు సీనియర్ నాయకుడు విఠల్‌ను ఇంచారీర్జిలుగా నియమించారు. విశేష రాజకీయ అనుభవం, నాయకత్వ ప్రతిభ , తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జీ బాధ్యతలుగా చేపట్టినట్లు సమాచారం. ఎలాగైనా రాబోవు ఎన్నికల్లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ  పార్టీని బలోపేతం చేయనున్నారు.

Comments

comments