Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

‘సైరా…’ నిర్మాణంపైనే దృష్టి

Charan

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ షూటింగ్ చకచకా సాగిపోతోంది. సంక్రాంతికి కాకున్నా వేసవికి అయినా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. మరోపక్క తన తండ్రి చిరంజీవితో ‘సైరా… నరసింహా రెడ్డి’ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మాస్ డైరెక్టర్ బోయపాటి నుంచి ఓ సినిమా చేద్దామని రామ్‌చరణ్‌కు ఓ  ప్రపోజల్ వచ్చిందట. ఇదే ఇప్పుడు చరణ్‌ను డైలమాలో పడేసిందట. రంగస్థలం షూటింగ్ పనులు దాదాపు జనవరి నాటికి పూర్తవుతాయి. అయితే రంగస్థలం సినిమాకు, సైరా నరసింహారెడ్డి సినిమాకు మధ్య ఓ సినిమా చేయాలా వద్దా అన్న ఆలోచనలో చరణ్ ఉన్నాడట. బోయపాటి అయితే చిరంజీవి కోసం స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగానే… రామ్‌చరణ్ కోసం ఓ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే స్క్రిప్ట్ వినిపించి ఫైనల్ చేసేందుకు బోయపాటి రెడీగా ఉన్నట్లు తెలిసింది. కానీ చరణ్ మాత్రం సైరా… చిత్ర నిర్మాణంపైనే ఎక్కువగా దృష్టిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Comments

comments