Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

చెదలకు చలనం!

Focus on the details of past cases

ఫైళ్ల దుమ్ము దులిపే పనిలో ఖాకీలు
గత కేసుల వివరాలపై దృష్టి
ప్రతినెలా ప్రత్యేక రివ్యూ

మన తెలంగాణ/ఖమ్మం క్రైం : రెండు నెలల నుంచి డిజిపి మహేందర్ రెడ్డి నుంచి వెలువడుతున్న ఆదేశాలు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన సిబ్బంది అటాచ్ మెంట్లు, భవిష్యత్తులో జరి గే అధికారుల బదిలీలు పోలీసు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇదిలా ఉండగా మరో పిడుగు పోలీసు అధికారుల నెత్తిన పడింది. గతంలో క్రైం రివ్యూ మీటింగ్ అం టే కేవలం ఎన్ని కేసులున్నాయి అనే ప్రశ్న తప్ప ప్రతి ఫైలునూ చదివిన దాఖలాలు ఎక్కువగా కనిపించ లేదు. కానీ ప్రస్తుతం ప్రతి అధికారీ, ప్రతి ఫైలునూ చదవాల్సిందేనని, దానికి సంబంధించిన మార్గ దర్శకాలు, కేసు పూర్తి పూర్వాపరాలు, ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేపబడిన నిందితులకు ఖచ్ఛితంగా శిక్ష పడేంతవరకూ పోలీసులు శ్ర మించాల్సిందేనని డిజిపి నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం.

ప్రతి ఎస్‌హెచ్‌ఒ ఆయా స్టేషన్లకు సంబంధించి గతంలో నమోదు చేయబడిన కేసుల పూర్వాపరాలు, ఫైళ్లు అన్నింటినీ ఓ క్రమ పద్ధతిలో పెడుతూ వాటి పూర్తి సమాచారాన్ని పై అధికారులకు ఖచ్ఛితంగా తెలపాలని, అదేరీతిలో పై అధికారులు సైతం ప్రతి ఎస్‌హెచ్‌ఒను ప్రతి కేసు వివరాలను క్షుణ్నంగా పరిశీలించి సంబంధింత ఫైలుపై ఎండార్స్‌మెంట్ చేయాలి. ప్రతినెలా ఒకటో తేదీన ప్రతీ సిఐ స్థాయి అధికారి సంబంధిత ఎస్‌హెచ్‌ఒలతో క్రైం రివ్యూ మీటింగ్ నిర్వహించాలి. వీటి పూర్తి వివరాలను సిఐ స్థాయి అధికారులు అందరూ ప్రతినెలా 9, 10 తేదీల్లో సంబంధిత డిఎస్‌పి/ఎసిపిలకు పూర్తి వివరాలు తెలుపుతూ అదేరీతిలో ఎసిపి స్థాయి అధికారి ప్రతి ఫైలునూ క్షుణ్ణంగా రివ్యూ చేస్తూ వివరాలు సేకరిస్తారు. ప్రతినెలా 18వ తేదీన ఎస్‌పి/సిపి స్థాయి అధికారులు జిల్లావ్యాప్తంగా ఎసిపిలతో క్రైం మీటింగ్ నిర్వహిస్తారు. ప్రతినెలా 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమిషనర్/ ఎస్‌పిలతో డిజిపి రివ్యూ నిర్వహిస్తారు. ఇదంతా పక్కా గా జరగాల్సిందేనని పోలీస్ బాస్ ఆదేశాలు. పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, ప్రతీ కేసు ఆన్‌లైన్, ఫిర్యాదుదారుకే నేరుగా మొబైల్ మెస్సేజ్ ద్వారా సమాచారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓ నేరస్తుడు వివిధ ప్రదేశాల్లో ఎన్ని నేరాలు చేశాడో.. క్లియర్‌గా ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరికీ కనిపించేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.

Comments

comments