Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

టాలీవుడ్‌పైనే దృష్టి

heroine

తెలుగులో ఇద్దరు టాప్ స్టార్స్‌తో నటించే అదృష్టాన్ని దక్కించుకున్న లక్కీ బ్యూటీ కైరా అద్వాని. బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేసిన ఈ భామకు టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభంలోనే మహేష్‌బాబు, రామ్‌చరణ్‌తో సినిమా అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం మహేష్‌తో ‘భరత్ అను నేను’ చిత్రంలో నటిస్తోంది ఈ భామ. అందాలొలికించడంలో ఏమాత్రం వెనుకాడని ఈ భామకు తెలుగు ఫిల్మ్‌మేకర్స్ మంచి ఆఫర్లు ఇస్తున్నారు. మహేష్, చరణ్ సినిమాలు కనుక హిట్ అయితే కైరా అద్వాని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారే అవకాశం ఉంది. ఇక ఈ భామ బాలీవుడ్‌లో చేసిన ఎంఎస్ ధోని తప్ప మిగిలిన రెండు సినిమాలు నిరాశపరిచాయి. దీంతో ఈ భామ ప్రస్తుతం తన దృష్టినంతా టాలీవుడ్‌పైనే పెట్టింది. తెలుగులో స్టార్లతో సినిమాలు కాబట్టి ఎలాగైనా మంచి హిట్స్‌ను అందుకోవాలని కైరా తహతహలాడుతోంది. ఈ రెండు కాకుండా మరో భారీ ఆఫర్ కూడా ఆమె కోసం ఎదురుచూస్తోందట. కానీ దాని గురించి ఈ హాట్ బ్యూటీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ‘భరత్ అను నేను’లో కైరా పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుందట. ఇందులో ప్రతిపక్ష నాయకుడు ప్రకాష్‌రాజ్ కూతురిగా ఆమె నటిస్తోందని తెలిసింది. గ్లామర్‌తో పాటు నటనకు స్కోప్ ఉండేలా దర్శకుడు కొరటాల శివ ఆమె పాత్రను తీర్చిదిద్దాడట. ‘శ్రీమంతుడు’లో శృతిహాసన్, ‘జనతాగ్యారేజ్’లో సమంతల కన్నా ఈ సినిమాలో కైరా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది.

Comments

comments