Home తాజా వార్తలు ప్రముఖ జానపద గాయకుడిపై రేప్, చీటింగ్ కేసు

ప్రముఖ జానపద గాయకుడిపై రేప్, చీటింగ్ కేసు

Police-Case

హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ జానపద గాయకుడు ఎద్దుల జంగారెడ్డిపై గాంధీనగర్ పోలీసులు లైంగిక దాడి, మోసం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన ట్రూప్‌లో కవాడిగూడకు చెందిన ఓ యువతి పాటలు పాడుతుంది. గతంలో యువతికి వివాహం కాగా ఓ పాప కూడా పుట్టింది. ఆ తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో జంగారెడ్డి దగ్గరుండి వారిద్దరికి విడాకులు ఇప్పించాడు.

అనంతరం ఒంటరిగా ఉంటున్న ఆమెను నీ  బాగోగులు నేను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. దాంతో ఆమె జంగారెడ్డితో సహజీవనం చేసింది. ఈ క్రమంలో యువతి జంగారెడ్డిని వివాహం చేసుకోవాలని కోరింది. దీంతో జంగారెడ్డి గత కొంతకాలంగా ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. జంగారెడ్డి ముఖం చాటేయడంతో బాధితురాలు మోసపోయానని గ్రహించి గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జంగారెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో లైంగిక సంబంధం నెరిపాడని, అంతేగాక మూడు సార్లు గర్భం దాలిస్తే అబార్షన్ చేయించుకునేలా ఒత్తిడి చేశాడని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదు పేర్కొంది. ప్రస్తుతం జంగారెడ్డి విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు జంగారెడ్డిపై లైంగిక దాడితో పాటు చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.