Home జాతీయ వార్తలు కెసిఆర్‌ను అనుసరించండి

కెసిఆర్‌ను అనుసరించండి

RAMDASచెన్నయ్ : తెలంగాణ సిఎం కెసిఆర్‌ను దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. తమిళనాడులోని పాట్టాలి మక్కల్ కట్చి నేత డాక్టర్ రామదాసు కెసిఆర్‌ను కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమిళనాడు సిఎం జయలలిత ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో కెసిఆర్ చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలపై ఆయన పొగడ్తలు కురిపించారు. జయలలిత కూడా కెసిఆర్‌ను అనుసరిస్తే ప్రజల ఆదరణ పొందొచ్చని, జనంలో ప్రభుత్వంతో పాటు అన్నాడిఎంకె కూడా మంచి ఆదరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.