Search
Tuesday 20 November 2018
  • :
  • :

మహాత్ముడి మార్గంలో నడవాలి

2PM-MODI

అహ్మదాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడిచి , సమాజంలో శాంతిని పెంపొందించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. గో రక్ష పేరుతో జరుగుతున్న మారణకాండను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన గుజరాత్‌కు వచ్చారు. గురువారం అహ్మదాబాద్‌లో ఆయన పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్ముని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు.

సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు. ఆశ్రమంలో నూలు వడికారు. ఆశ్రమం శతాబ్థి ఉత్సవాల్లో పాల్గొని శ్రీమద్ రాజ్‌చంద్ర 150వ జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం పోస్టల్ స్టాంప్, స్మారక కాయినును మోడీ ఆవిష్కరించారు.

Follow the Mahatma : Modi

Comments

comments