Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎన్నికల నియమావళిని పాటించాలి

Following the elections of Conduct,

జిల్లా కలెక్టర్ శరత్

మనతెలంగాణ/జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అందరూ ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల తో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని, ఉల్లంఘనకు పా ల్పడితే అనర్హతకు గురవుతారన్నారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రతి అభ్యర్థి లెక్కలు చూపాలన్నారు. ప్రవర్త నా నియమావళి అన్ని రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అ భ్యర్థులకు,మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక సంస్థల ఎన్నికలతో సంబంధం ఉన్న ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూ లు ప్రకటించిన తేది నుంచి నియమావళి అమలుకు వచ్చి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు అమలులో ఉం టుందన్నారు. ఏ పార్టీ లేదా అభ్యర్థి గానీ ప్రస్తుతం నెలకొ న్న విభేదాలను తీవ్రతరం చేయడం, పరస్పర ద్వేష భావా న్ని సృష్టించడం,వివిధ కులాలు, మతాల మధ్య, భాషల మ ధ్య విబేధాలు సృష్టించే కార్యకలాపాల్లో పాల్గొనరాదన్నా రు. జాతి, మతం, కులం, ప్రాంతం ప్రాతిపదికన ఓటు వే యాలని కోరడం నేరమవుతుందన్నారు.
ఎన్నికల ప్రచారానికి ప్రార్ధనా మందిరాలైన దేవాలయా లు,మసీదులు, చర్చిలను వేదికలుగా వాడరాదని కలెక్టర్ సూచించారు. ఒక అభ్యర్థి ప్రజా జీవితానికి సంబంధం లేని వ్యక్తిగత విషయాలు, వాస్తవాలను రూఢీ పరుచుకోకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయరాదన్నారు. ఊరేగింపులు, బహిరంగ సభలను నిర్వహించేందుకు తప్పని సరిగా అనుమతి తీసుకోవాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వే లు, అంతకు మించిన జనాభా గల గ్రామ పంచాయతీ స ర్పంచ్ పదవి అభ్యర్థికి ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితి రూ. 2.50లక్షలు,5వేల కంటే తక్కువ జనాభా ఉంటే రూ. 1.50లక్షలు ఖర్చు చేయవచ్చన్నారు. అలాగే 5 వేల జనా భా మించి ఉన్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.50 వేలు,5వేల కంటే తక్కువ జనాభా ఉంటే రూ.30 వేల గరిష్ట వ్యయ పరిమితిగా నిర్ణయించినట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థి నిర్ధిష్ట నమూనాలో రోజు వా రి ఎన్నికల వ్యయాన్ని తెలిపే రికార్డును నిర్వహించాలన్నా రు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల లోపు పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తన మొత్తం ఎన్నికల ఖర్చు వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు.
ఎన్నికల ప్రచార నిమిత్తం విశ్రాంతి భవనాలు, సర్కూట్ హౌజ్‌లు,ఇతర ప్రభుత్వ వసతిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి శాంతియుత వాతావరణంలో, సజావుగా ఎన్నికలు నిర్వహణ జరిగేలా తోడ్పాటును అందించాలని కలెక్టర్ రాజకీయ పార్టీల నాయకులను కోరారు. ఈ సమావేశంలో జెసి రాజేశం, జిల్లా పంచాయతీ అధికా రి లక్ష్మీనారాయణ, టిఆర్‌ఎస్ పార్టీ తరఫున గట్టు సతీశ్, బిజెపి తరఫున లింగంపేట శ్రీనివాస్, టిడిపి తరఫున దయాల మల్లారెడ్డి,సిపిఐ తరఫున బోయిని అశోక్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున గంగాధర్, బిఎస్‌పి తరఫున భూషణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments