Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) రోడ్డు భద్రత సూచనలు పాటించడం తప్పనిసరి

రోడ్డు భద్రత సూచనలు పాటించడం తప్పనిసరి

SAFTY

మన తెలంగాణ/ ఉప్పల్ : రోడ్డు భద్రతా సూచనలు ప్రతి ఒక్క వాహనదారుడు బాధ్యతతో పాటించి ప్రమాదాల భారి నుండి తప్పించుకోవాలని, మీ భద్రత మీ కటుంభానికి రక్ష అనే నినదాంతో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రతి వ ్యక్తి వాహనం నడిపేప్పుడు బాధ్యత అనేది తప్పకుండా ఉండాలని డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమీషనర్ ప్రవీణ్ రావు అన్నారు. జనవరి 18న రోడ్డు భద్రతా వారోత్సవాల సంద ర్భంగా ఉప్పల్ ఆర్‌టిఓ ఆఫీస్ నుండి నాగోల్ వరకు ఆటో ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఫోర్‌వీలర్ వాహనదారులు ట్రాఫిక్ సూచనలు పాటించి తను బాధ్యతగా వ్యవహరించి తన క్షే మాన్ని కోరుకుంటూ ఎదుటివారి క్షేమాలను కోరుకునేం దుకు రోడ్డుపైన వాహనాలు బాధ్యతగా నడిపించాలని ఆ యన వాహనదారులను కోరారు. గత సంవత్సరంతో పోలి స్తే ఈ సంవత్సరానికి ప్రమాదాలు బారిగా తగ్గాయని, రోడ్డు ట్యాక్స్, అధికలోడుతో వాహనాలు నడుపకూడదని, సమ యాన్ని పాటించకుండా నగరంలోకి వాహనాలు రాకూడద న్నారు. మేడ్చల్‌జిల్లా ట్రాన్స్‌ఫోర్ట్ అధికారి ముప్పాల శ్రీనువాసు, ఉప్పల్ ట్రాన్స్‌ఫోర్ట్ అధికారి వెంకటేశం, ఎంవిఐలు రవీంద్ర కుమార్, ప్రవీందర్ రాజు,సురేశ్ రెడ్డి, చిరంజీవులు, అమృత వర్షిణి, ఆఫీసు సిబ్బంది సురేశ్,ఇప్తేకార్ తదితరులు పాల్గొన్నారు.