Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కిచెన్ టవల్స్‌తో ఫుడ్‌పాయిజనింగ్..!

Kitchen-Room

ప్రతి ఒక్కరూ వంటింట్లో, ఫ్రిజ్ దగ్గర, షింక్ వద్దా నాప్కిన్లను వాడుతుంటారు. చేతులు తుడుచుకోవడానికి, కడిగిన గిన్నెలను తుడుచుకోవడానికి, వేడి పాత్రలను స్టవ్ నుంచి దింపడానికి చిన్న చిన్న టవల్స్‌ను ఉపయోగిస్తుంటారు. కొంతమంది వీటిని పైపైన ఉతికేసి చాలా శుభ్రంగా ఉన్నాయని అనుకుంటారు. కానీ తాజా పరిశోధనలో తేలిందేమంటే ..శుభ్రంగా లేని వంటింటి టవల్స్ వల్ల తినే ఆహారం విషపూరితం కావొచ్చని పరిశోధకులు కనుగొన్నారు. మారిటియస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం కిచెన్‌లో ఒక నెల రోజులు ఉపయోగించిన వంద టవళ్లను తీసుకుని పరీక్షలు చేశారు. వాటిలో బ్యాక్టీరియా, ఇ కోలిలాంటివి ఉన్నట్లు కనుగొన్నారు. మాంసాహారం వండేవారి ఇంట్లోని టవల్స్‌లో వీటి శాతం మరింత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వందలో 49 టవల్స్‌కి మాత్రం పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. వాటిల్లో బ్యాక్టీరియా గ్రోత్ తక్కువున్నట్లు తెలిసింది. 36.7 శాతం వాటికి కోలిఫోర్మ్ బాక్టీరియా, ఇకోలి లాంటివి అధిక శాతంలో ఉన్నాయన్నారు.

ఇ కోలి అనేది అస్సలు శుభ్రత లేకపోవడం వల్ల పెరుగుతుంది. కిచెన్‌లో ఉపయోగించే టవల్స్ వల్ల మరింత ఎక్కువగా వృద్ధి చెందుతుందని పరిశోధన హెడ్ డా. బిరంజియా హృదోయల్ వెల్లడించాడు. తడిగా ఉన్నవి, మల్టీపర్పస్‌గా ఉపయోగించే టవల్స్ వల్ల ఇంట్లో వృద్ధులు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వారు అనారోగ్యానికి త్వరగా గురవుతారని చెబుతున్నాడు. బ్యాక్టీరియా వంటగదిలోనే వృద్ధి చెందుతుంది. అందుకనే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించాలి. వారానికి ఒకసారి టవల్స్‌ను వేడినీళ్లులో శుభ్రపరచాలి. ఎండలో ఆరేయాలి. బాగా పాడయితే పడేసి, దానిస్థానంలో వేరొకటి పెట్టాలి. తడిగా ఉన్నప్పుడు అస్సలు వాడకూడదు. ఇదే పద్ధతిలో కిచెన్‌లో ఉపయోగించే స్పాంజ్‌ను కూడా ఉపయోగించుకోవాలి. గుడ్లు, మాంసం లాంటివి వండిన తర్వాత చేతులను శుభ్రం చేసుకుని, తడి లేకుండా తుడుచుకోవాలి. కొన్ని సందర్భాల్లో పేపర్ టవల్స్‌ను వాడొచ్చు. వాటిని మళ్లీ దాచిపెట్టి వాడొద్దు. లేకుంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా నేరుగా వండుకునే ఆహారంలో చేరే అవకాశాలు ఎక్కువ.

Comments

comments