Home జాతీయ వార్తలు ముంబయిలో కూలిన పాదచారుల వంతెన

ముంబయిలో కూలిన పాదచారుల వంతెన

Accident

ముంబయి: ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సమీపంలో పాదచారుల వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. సీఎస్ఎంటీ ప్లాట్‌ఫాం 1కు దారితీసే వంతెన కుప్పకూలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. స్థానికులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వంతెన శిథిలాల కింద 12 మంది చిక్కుకొని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది. గాయపడిన వారి సంఖ్య  పెరిగే అవకాశం ఉంది .  రెస్క్యూ టీం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

 

Footover Bridge Collapse in Mubai