Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పోడు భూములకు రైతు బంధు అందేనా?

forest

*పెట్టుబడి సహాయానికి ప్రభుత్వం మొండి చేయి
*గిరిజన రైతులకు వడ్డీ వ్యాపారులే శరణ్యమా..
*అటవీ భూముల్లో సాగు చేస్తున్న గిరిజనులపై నిర్ణయం తీసుకొని సర్కారు

మనతెలంగాణ/ఆసిఫాబాద్: తరతరాలుగా భూమి కోసం పోరాటాలు చేసి తమ రక్తాన్ని చిందించి ఎట్టకేలకు  అటవీ భూములపై సాధించుకున్న హక్కు లు తమ జీవితాలను మార్చివేస్తాయని సంబరపడిన గిరిజన రైతులకు ఆదిలోనే నిరాశ ఎదురవుతోంది.  ప్రభుత్వం నిర్ణయించిన భూ సర్వేలో అటవీ భూము ల్లో సాగుచేసుకుంటూ ఆటవీ భూముల హక్కు చట్టం కింద హక్కు పత్రాలు పొందినప్పటికీ  భూ సర్వేలో ఆటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతు లను పరిగణలోకి తీసు కోవడంలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆటవీ భూముల్లో సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం ఇచ్చే పంట పెట్టు బడి సహాయం రైతు బంధుపథకం అందే అవకాశాలు లేవు. ఈ సంవత్సరం కూడా గిరిజన రైతులు వ్యవసాయం కోసం వడ్డీ వ్యాపారుల ఆశ్రయించక తప్పని పరిస్థితులు  ఏర్పడ్డాయి. అటవీ భూములను సాగు చేసుకుంటు గిరిజన దారిద్య్రాన్ని అనుభవిస్తు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఎకరానికి నాలుగు వేల ఆర్థిక సహాయం కూడా అందదని తెలియడంతో గిరిజన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆటవీ భూముల్లో సాగు చేసుకుంటూ అటవీ హక్కు పత్రాలు పొందిన రైతుల వివరాలను రికార్డుల్లో చేర్చలేదని వాటి విషయమై ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన సూచనలు రాకపోవడంతో అటవీభూము సాగులో ఉన్న గిరిజన రైతుల వివరాలను పక్కన పెట్టామని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అటవీ భూమి హక్కుల చట్టం కింద 40వేలకు పైగా ఎకరాల భూమి ఉన్న గిరిజన రైతులకు హక్కు పత్రాలు ఇచ్చారు. ఆటవీ భూములపై ఆధారపడి 15వేలకు పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. పోడు వ్యవసాయం చేసుకున్న వారికి హక్కులు లేకపో యినప్పటికీ అటవీ హక్కు చట్టం కింది హక్కు పత్రాలు పొందిన వారికి కూడా భూ ప్రక్షాళనలో చోటు కల్పించలేదు. దీంతో జిల్లాలో ఆత్యధికంగా ఉన్న గిరిజన రైతులు ఆందోళనలో పడ్డారు. భూమి కోసం గిరిజనులు  తరతరాల నుంచి  పోరాటాలు చేస్తున్నారు. గిరిజన ఉద్యమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తరలించాయి. వారి పోరాటం ఫలించి అటవీ భూముల సాగు చేసుకుంటున్న గిరిజనులకు భూముల పై హక్కులు కల్పిస్తూ చట్టం రూపొందించింది. తమ కల ఫలించిందని గిరిజన రైతులు సంబరపడ్డారు. కాని రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ రికార్డుల ప్రక్షాలనలో అటవీ భూములపై హక్కు పత్రాలు ఉన్న రైతులకు మొండి చేయి చూపారు. ఈ కారణంగా ప్రభుత్వం అందించే ఎకరానికి నాలుగువేల రూపాయల పెట్టుబడి సహాయం కూడా వారికి అందకుండా పోతుంది. బ్యాంకు నుంచి కూడా ఏలాంటి పంట రుణాలుఅందే అవకాశాలులేవు. గతంలో అటవీ హక్కు పత్రాలను చూసి బ్యాంకులో రుణాలు తీసుకొని పంట లు వేసుకునే వారు ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు ఉండే అవకాశం లేదు. ఏడాది పోడువున కష్టపడే గిరిజన రైతులు వ్యవసాయ రంగంలో నిలదొక్కుకోవడానికి అనేక అండంకులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఓవైపు వేధిస్తుండగా పెట్టిన పెట్టుబడి రాక వడ్డీల భారం పెరిగి గిరిజన రైతుల తల్లడిల్లి పోతున్నారు. వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులు గిరిజన రైతులను అనేక రకాలు మోసగిస్తునే ఉన్నారు. వడ్డీపై వడ్డీ వసూలు చేస్తూ వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్న పట్టించుకునే వారే లేరు. ఆరుకాలం కష్టించిపండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వడ్డీ వ్యాపారులు తమకు ఇష్టమైన ధరకు పంటను కొనుగోలు చేయడంతో ఏడాది కష్టపడిన నెలగాసం తెప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వినూత్నపథకాన్ని అమలు చేస్తున్నందున గిరిజన రైతులకు ఆదుకునే విధంగా అటవీ హక్కుల చట్టకింద భూమి హక్కు పత్రాలు పొంది తరతరాలుగా భూమి సాగు చేసుకుంటున్న రై తుల కు పెట్టుబడి సహాయం అందేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘాలు పేర్కొంటున్నారు.

Comments

comments