Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఫోర్బ్స్ టెక్ కుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయులు

Azim-Premji-and-Shiv-Nadarన్యూఢిల్లీ: ఫోర్బ్స్ రూపొందించిన టెక్నాలజీ రంగంలోని  100 ప్రపంచ సంపన్నుల జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు లభించింది. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సిఎల్ సహవ్యవస్థాపకుడు శివ్ నాడార్ జాబితాలోని టాప్ 20 మందిలో నిలిచారు. వారు గూగుల్ బాస్ ఎరిక్ ష్మిత్, ఉబెర్ సిఇఒ కలనిక్ కంటే వీరు ముందున్నారు. ఫోర్బ్ రూపిందించిన  ‘100 రిచెస్ట్ టెక్ బిలియనీర్స్ ఇన్ ద వరల్డ్ 2016 ’ జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 78 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తితో అగ్ర స్థానంలో నిలిచారు.  16 బిలయన్‌ల అమెరికా డాలర్ల ఆస్తితో ప్రేమ్‌జీ 13వ స్థానంలో, 11.6 బిలియన్ డాలర్ల ఆస్తితో శివ్  నాడార్ 17వ స్థానంలో ఉన్నారు.  ప్రేమ్‌జీ భారత్ నుంచి మూడో అతి పెద్ద ఔట్‌సోర్సర్‌గా ఉన్నారు.  విప్రో కంపెనీ గత  ఏడాది వృద్ధిని పెంపొందించుకునేందుకు విరివిగా కొనుగోళ్లకు పాల్పడిందని ఫోర్బ్స్ పేర్కొంది. ఇక నాడార్ హెచ్‌సిఎల్ టాలెంట్ కేర్ అనే నైపుణ్యాభివృద్ధి సంస్థకు యజమాని. ఆ సంస్థ కొత్త గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇస్తుంది. ఆయన తాజా వెంచర్ స్టార్టప్స్‌లోనూ, అమెరికా హెల్త్ కేర్ టెక్ ఫర్మ్‌లో 500 మిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు భారత్-అమెరికన్ టెక్నాజీ దిగ్గజాలకు కూడా చోటు లభించింది. సింఫోనీ టెక్నాలజీ గ్రూప్ సిఇఒ రమేశ్ వాధ్వానీ, సింటెల్ అనే ఐటి ఔట్‌సోర్సింగ్, కన్సల్టింగ్ కంపెనీ వ్యవస్థాపకులు భరత్ దేశాయ్, ఆయన సతీమణి నీరజ్ సేథీలు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు. వాధ్వానీ 3 బిలియన్ నికర ఆస్తులతో జాబితాలో 67 స్థానంలో నిలిచారు.  స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది ఒడిదుడుకులకు లోనైనప్పటికీ టెక్ బిలియనీర్లకు మాత్రం కలిసొచ్చిన కాలమేనని ఫోర్బ్స్ అభిప్రాయపడింది.

Comments

comments