Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ మహిళలు

Prastituction

హైదరాబాద్: వ్యభిచార దందా చేస్తున్నఇద్దరు విదేశీ మహిళలను రాచకొండ ఎస్‌ఒటి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్‌ఒటి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం…టాంజానియా దేశానికి చెందిన సచ్చా జైసీ గుడ్‌ల్యాక్(25), ఎంమంగా డెబోరా(25) టూరిస్టు వీసా మీద భారతదేశానికి వచ్చారు. ఈ ఇద్దరు యాప్రాల్ శైలి గార్డెన్‌లో ఓ ఇంటిని కిరాయికి తీసుకుని ఆన్‌లైన్‌లో వ్యభిచార దందాను కొనాసాగిస్తున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో క్లయింట్స్ ను ఆకర్షిస్తూ వాళ్లను ఇంటికి పిలిపించుకుని వ్యాపారాన్నిగుట్టుగా సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఒటి పోలీసులు దాడిచేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి వీసా గడువు 2016 నవంబర్‌లో ముగిసిపోగా, మరో యువతికి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వీసా గడువు ఉందని పోలీసులు తెలిపారు.

Comments

comments