Home తాజా వార్తలు విదేశీ పెట్టుబడులు రూ.8500 కోట్లు

విదేశీ పెట్టుబడులు రూ.8500 కోట్లు

Foreign investments worth Rs 8500 crore

న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు గత ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో దాదాపు రూ.8500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారు. క్రూడ్ ఆయిల్ ధరలు మెరుగుపడడం, రూపాయి స్థిరీకరణ, ఉత్తమ కార్పొరేట్ ఫలితాలు వంటి సానుకూల అంశాల నేపథ్యంలో ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు)లు భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. గత నెలలో ఈక్విటీ, డెబిట్ మార్కెట్లలో నికరంగా విదేశీ నిధుల ప్రవా హం రూ.2,300 కోట్లుగా ఉంది. అయితే ఏప్రిల్‌జూన్ కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.61 వేల కోట్లు నిధులను వెనక్కి తీసుకున్నారు.

తాజా డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఆగస్టు 1 నుంచి 10 తేదీ వరకు ఈక్విటీల్లో ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 2,373 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డెబిట్ మార్కెట్లోకి రూ.6,208 కోట్లు, మొత్తంగా రూ.8,581 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మార్నింగ్‌స్టార్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ హిమాన్షు శ్రీవాత్సవ మాట్లాడుతూ, క్రూడ్ ఆయి ల్ ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మెరుగవడం, ప్రోత్సాహకర త్రైమాసిక ఫలితాలు వెరసి విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఊపందుకుందని అన్నారు.