Home లైఫ్ స్టైల్ సాంకేతిక సాయంతో అటవీ ఆక్రమణల నివారణ

సాంకేతిక సాయంతో అటవీ ఆక్రమణల నివారణ

Tree-Cut-in-Forest

అరణ్యాలు నశిస్తే ప్రకృతి వాతావరణ సమత్యులం దెబ్బతిని మానవ మనుగడ అగమ్య గోచరమవుతుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా అడవుల ఆక్రమ నరికి వేతకు అడ్డూ ఆపూ ఉండడం లేదు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో అడవులను ధారదత్తం చేయడం కూడా అడవుల నాశనానికి దారి తీస్తోంది. కోల్పోయిన అడవులను తిరిగి పెంచాలన్న నిబంధనలు ఉన్నా ప్రభుత్వాలు పాటించడం లేదు. ఈ నేపథ్యంలో అటవీ ఆక్రమణలను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక విధానాలను అవలంబిస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్ ఎస్‌సి) సహకారంతో అడవుల ఆక్రమణలను ఎప్పటికప్పుడు ముందుగా తెలుసుకొని నివారించడానికి సమాయత్తం అవుతోంది. ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి జియోగ్రాఫిక్ సమాచార వ్యవస్థే కీలక పాత్ర వహిస్తుంది. దీని ద్వారా ఆక్రమణలను కనుగొని నెలవారీ శాటిలైట్ డేటాను ఎన్‌ఆర్ ఎన్‌సికి అందజేస్తుంది. ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ వ్యవస్థ మొబైల్ ఫోన్ల ద్వారా సంబంధిత అధికారులను హెచ్చరిస్తుంది.

ఈ హెచ్చరికల వల్ల అడవుల ఆక్రమణలను అడ్డుకోడానికి వీలువుతుంది. ఈ విధంగా కొన్ని నెలల పాటు డేటా సేకరించాక హెచ్చరికల వేగం పెంచుతారు. అయిదు రోజుల కోకసారి హెచ్చరికలు జారీ చేస్తారు. ఏడాది కోసారి జి ఐఎస్ సర్వే చేసిన తరువాత ఆక్రమణలను గుర్తించేవారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అయితే రెండేళ్ళ కోసరి సర్వే చేసేది. అప్పుడు ఆక్రమణదారులను పట్టుకోవడం కష్టం అయ్యేది. అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆటోమేటిక్ వ్యవస్థ ద్వారా హెచ్చరికలు జారీ చేసే పద్ధతిని అవలంభిచడం చాలా వరకు ప్రయోజనం కలిగింది. ఇది గమనించి అటవీ శాఖ విభాగం ఏడాది క్రితం ఎన్‌ఆర్‌ఎస్‌సిని సంప్రదించింది. ఆక్రమణలను కనుగొనడానికి సహకరించాలని అభ్యర్థించింది. ఇదే ప్రయత్నంలో కేంద్ర అటవీ పర్యావరణ విభాగం ఉండడంతో తెలంగాణలోని అడవుల ఆక్రమణలను నివారించడాన్ని సహకరించడానికి అంగీకరించింది. దీనిపై నమూనాగా కొత్తగూడెం జిల్లాలో అధ్యయనం చేశారు.

జిల్లా స్థాయి అధికారుల క్షేత్రస్థాయి తనిఖీ నివేదికలతో ఎన్‌ఆర్ ఎస్‌సిసి డేటా సరిపోయింది. వార్షిక సర్వే ప్రకారం మొత్తం అక్రమణల్లో 90శాతం కొత్తగూడెం, భూపాల పల్లి జిల్లాలోనే జరిగింది. పొరుగున ఉన్న ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నుంచి గిరిజన ప్రజలు కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలకు వలస రావడం తోనే అటవీ ఆక్రమణలు ఎక్కువగా జరిగినట్టు స్పష్టమవుతోంది. గొత్తి కోయిలు, అటవీ సిబ్బందికి మధ్య ఈ కారణంగానే ఘర్షణలు జరుగుతున్నాయి.. ఈ కొత్త విధానం వల్ల సాక్షాధారాలు నిరూపించి ఘర్షనలు తగ్గించాలన్న యత్నంలో అటవీ శాఖ నిమగ్నమైంది. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2013-16 మధ్య కాలంలో దాదాపు ఆరులక్షల చెట్లు అక్రమంగా నరికి వేయబడ్డాయి. తెలంగాణల్లో సమారు లక్ష ఎకరాల అటవీ ప్రాంతం కోల్పోయింది. భారత్‌తో పాటు నేపాల్, బంగ్లాదేశ్‌ల్లో వరదల ప్రళయం వంటి ప్రకృతి వైపరీత్యాలు అడవుల నరికివేత వల్లనే సంభవిస్తున్నాయని చెబుతున్నాయ్. దేశంలో 33శాతం మేర అడవులను విస్తరింప చేయాలన్న లక్షం పెట్టుకున్నా,21.53 శాతం విస్తీర్ణానికే పరిమితమైంది. ఆనకట్టలు, గనుల తవ్వకం, పరిశ్రమల ఏర్పాటుకు అటవీ భూములనే అప్పగిస్తున్నాయి. అందుకు బదులుగా అడవులను పెంచవలసి ఉంది. కనీసం ఈ మేరకు ఏ నిబంధనలు ఆచరణలోకి రావడం లేదు. దేశంలో అటవీ పచ్చదనం హరించుకు పోతోందని ఈ మేరకు 46లక్షల హెక్టార్లలో అడవులు పచ్చదనాన్ని కోల్పోయినట్టు హైదరాబాద్ జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్‌ఆర్ ఎస్‌సి) వెల్లడించింది.

మధ్య ప్రదేశ్, అసోం, కర్లాటక, ఒడిశా, మహారాష్ట్రలో భారీగా అటవీ భూముల అక్రమ ఆక్రమణలకు గురయ్యాయని నివేదకలు చెబుతున్నాయి. అడవులను తిరిగి పునరుద్ధరించడనాకి కావలసిన నిధులు మాత్రం కేంద్రం నుంచి తిరిగి రాష్ట్రాలకు జమకావదం లేదు. ప్రత్యామ్నాయ అటవీ నిర్వహణ సంఘం( కంపా) వద్ద రూ.42 వేల కోట్ల నిధి ఉన్నా అందులో 90శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్ణయించినా దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా తయారు కాలేదని కేంద్రం కాలాతీతం చేస్తోంది. రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాలు అడవులను సమర్థవంతంగా కాపాడుకోగలుగుతున్నాయి. వాటిని ఆదర్శంగా భారత దేశం సరైన చర్యలు తీసుకోకుంటే అడవులు హరించిపోయి ఎడారి విస్తరించే ప్రమాదం ఏర్పడుతుంది.
మన తెలంగాణ / విభాగం