Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రగిలిన ‘పోడు’

అటవీ సిబ్బందిని అడ్డుకునేయత్నం
వెనుదిరిగేదిలేదన్న అధికారులు
రైతులు, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం
జెసిబి, జీపు, మూడు బైక్‌లను తగలబెట్టిన వైనం

Fire-Accident-in-JCB

గుండాల: తాతముత్తాల కాలం నుంచి సాగు చేసుకున్న భూమి. ఎండనక వాననక కష్టించి సాధించుకున్న భూమి. దశాబ్ధాలుగా తమకు జీవనాధారమైన భూమి. ఒకేసారి అటవీ అధికారులు లాగేసు కుంటున్నారనే విషయం వారిని కంగారుకు గురిచేసింది. తమగోడు విన్నవించిన అధికారులు కనికరించకపోవడం వారిలో ఆగ్రహాన్ని రగిలిచింది. చివరికి ఆ ఆవేశం అధికారులపై దాడికి దారితీసింది. వాహనం ధ్వంసానికి ఉసికొల్పింది. వివరాల్లోకి వెళితే… గుండాల  శెట్టిపల్లి గ్రామ శివారులో గిరిజనులు ఏళ్లక్రితం నుంచి పోడు సాగు చేసుకుంటున్నారు. ఇటీవల భూమిని స్వాధీన పరుచుకునేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో మంగళవారం అక్కడకు చేరుకుని మొక్కలు వేసేందుకు చుట్టూ ట్రెంచ్(కందకం) తవ్వేందుకు సిద్ధమయ్యారు. దీంతో గిరిజనులు ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. తమ భూమిని తమకే ఇవ్వాలని, తమ పొట్ట కొట్టొద్దని అధికారులను వేడుకున్నారు. కాళ్లావేళ్లా పడ్డారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకపోవడంతో వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరగడంతో పరిస్థితి ఆందోళనకు దారితీసింది. దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈ ఘటనలో జెసిబి, జీపు, మూడు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఇల్లందు డిఎస్‌పి ప్రకాశరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుండాల, కొమరారం ఎస్‌ఐలు సురేష్, ప్రవీణ్ కుమార్, రేంజర్చారిలు పర్యవేక్షించారు. కాగా భయానికి గురైన గిరిజనులు పారిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments