Home మంచిర్యాల ఉచ్చులో పడిన పులి జాడేది?

ఉచ్చులో పడిన పులి జాడేది?

forest-officials-who-are-safe

సురక్షితంగానే ఉందంటున్న అటవీ అధికారులు
ఇప్పటికీ సిసి కెమెరాలకు చిక్కని గాయపడిన పులి
అటవీశాఖ అధికారుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
టైగర్ జోన్‌లో పెద్ద ఎత్తున నిఘా నేత్రాల ఏర్పాటు

మన తెలంగాణ/మంచిర్యాల: బెజ్జూర్ అటవీ ప్రాంతంలో ఉచ్చులో చిక్కుకున్న పులి సురక్షితంగానే ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత నవంబర్ నెలలో తీవ్రంగా గాయపడి జన్నారం టైగర్ జోన్‌కు చేరుకున్న పులి తీవ్రంగా గాయపడ్డట్లు సిసి కెమెరాల చిత్రాల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు పులి జాడ తెలియకపోవడంతో అటవీ అధికారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బెజ్జూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు గురైన పులికి ఇనుప తీగలు చుట్టుకొని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పులికి చుట్టుకున్న ఇనుప తీగల వల్ల ఇన్‌ఫెక్షన్ సోకి మృతి చెందిందాననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా అటవీ అధికారులు మాత్రం పులి సురక్షితంగానే ఉందని భావిస్తున్నారు. గాయపడిన పులిని గుర్తించి దానికి చుట్టుకున్న ఇనుప తీగలను తొలగించేందుకు గత ఎనిమిది నెలలుగా జన్నారం జంతు సంరక్షణ సిబ్బంది వెతుకుతున్నా ఫలితం కానరాలేదు. ఉచ్చుతో ఉన్నపులి ఇప్పటి వరకు దాదాపు 60 పశువులను, అడవి పందులు, జింకలు, దుప్పులను వేటాడినట్లుగా అటవీ అధికారులు సిసి కెమెరాల ఫుటేజీల ద్వారా గుర్తించారు. గత నవంబర్ నెలలో ఇనుప తీగలతో తీవ్రంగా గాయపడిన పులి ఇటీవలి కాలంలో శారీరకంగా ఎదిగి ఉండవచ్చునని, దీని కారణంగా ఇనుప తీగ తెగిపోయి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నప్పటికీ పులి జాడ కనిపించడం లేదు. కాగా ఉచ్చులో చిక్కుకున్న పులికి ఉన్న ఇనుప తీగలు విష పూరితంగా మారే