Search
Saturday 17 November 2018
  • :
  • :

అడవి బిడ్డలను అమ్మలా… ఆదరిస్తున్న అడవి తల్లి

Forest-Products

కడెం: స్వాతంత్రం వచ్చి 68 ఏళ్లు గడుస్తున్న గిరి బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపే నాథులే కరువయ్యారు. ప్రభుత్వా లు ఏళ్లుగా పాలిస్తున్న గిరిజన సమస్యలపై సమగ్ర ప్రణాళికలు లేకపోవడంతో సంక్షేమ పథకాలు వారికి అందని ద్రాక్షగానే మిగిలి పోయాయి. గిరిజన బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అధికారులు అలసత్వ దోరణి, నిధులపై ‘మాములు’గా వ్యవహరించ డంతో వారి బతుకులు చిద్రమయ్యాయి.

ఏళ్లుగా అడవి తల్లే గిరిజనులను అమ్మ లా ఆదరిస్తోంది. అడవిలో దొరికే అటవి ఉత్పత్తులతోనే ఇన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. అడవిలోని ఇప్ప పువ్వు, ఇప్ప పరక, టేకు సీడ్, తునీకాకు, లక్క, తేనే, బంక, వెదురు బొంగులు, వంట చెరుకు వంటి వాటిని సేకరించి అమ్ముకుంటూ చాలి చాలని జీవితాలను వెల్ల దీస్తున్నారు. అడవి తల్లే వారికి అండగా నిలబడుతుం ది. నేటి ప్రభు త్వం గిరిజనులపై పక్కా ప్రణాళికతో సంక్షేమ పథకాలు రూపొందిస్తే గిరిజనులు అభివృద్ది చెందుతారని విద్యావెత్తలు కోరుతున్నారు.

Comments

comments