Home జాతీయ వార్తలు కాంగ్రెస్‌కు మాజీ సిఎం రాజీనామా

కాంగ్రెస్‌కు మాజీ సిఎం రాజీనామా

Former CM Resigns to Congress

షిల్లాంగ్ : మేఘాలయలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పని చేసి, ఐదు సార్లు మేఘాలయకు సిఎంగా వ్యవహరించిన డిడి లపాంగ్ ఆ పార్టీ నుంచి వైదొలిగారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలను దూరం పెడుతున్నారని, అందుకే తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పంపించారు. మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లపాంగ్ రాజీనామా కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన మేఘాలయ ఎన్నికల్లో 20 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించింది. అయితే 19 సీట్లు గెలిచిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) బిజెపి, ఇతర పార్టీల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Former CM Resigns to Congress