Home జగిత్యాల అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Former Commit Sucide In Jagityal District
పెగడపల్లి : అప్పుల బాధతో రైతు పశువుల కొట్టంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు చెనాల్ల నర్సయ్య (59) అనే రైతు వ్యవసాయం కోసం అప్పులు చేసి అప్పుల పాలైనాడు. దీంతో తనకు  ఉన్న భూమిని అమ్మిన అప్పులు తీరలేదు.  కుటుంబ పోషణ బరువై, అప్పులు ఎక్కువ అవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ జీవన్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.