Home తాజా వార్తలు దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారాకు అస్వస్థత

దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారాకు అస్వస్థత

 

ముంబయి: వెస్టిండిస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ప్రపంచకప్ మ్యాచ్‌ల నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్ నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమంలో పాల్గొన్న లారాకు ఛాతి నొప్పి రావడంతో ఆయనను ముంబయిలోని గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.కాగా, ఐసిసి వన్డే వరల్డ్‌కప్‌లో లారా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Former cricketer Brian Lara admits in Hospital at Mumbai