Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మాజీ క్రికెటర్ గోపాల్ ఇకలేరు

Bos

కోల్ కతా: మాజీ క్రికెటర్ గోపాల్ బోస్ (71) ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. లండన్ లో ఓ ప్రవేటు ఆస్పత్రిలో  గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ బోస్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. బెంగాల్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. అంతర్జాతీయ జట్టు తరపున ఇంగ్లాండ్ తో ఒకే ఒక వన్డే ఆడారు. 78 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడి 3757 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అండర్ -19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు జట్టుకు గోపాల్ బోస్ మేనేజర్ గా పని చేశాడు.

బోస్‌ మృతికి పలువురు క్రికెటర్లు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మరణ వార్త విన్న గంగూలీ.. తాను ఓ ఆప్తుడిని కోల్పోయానని ట్వీట్‌ చేశాడు. గోపాల్‌ బోస్‌ మృతి భాధాకరమని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  తెలిపారు.

Comments

comments