Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

గంగూలీకే క్యాబ్ పీఠం

Sourav-Ganguly2కోల్‌కతా: ఊహించినట్లే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (కాబ్) అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకే దక్కాయి. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్యాబ్ ముఖ్య అధికారులతో గురువారం చర్చించిన అనం తరం గంగూలీ నియమకాన్ని ఖరారు చేశారు. కాబ్ అధ్య క్షుడిగా కొనసాగిన బిసిసిఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మి యా మృతితో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు గంగూలీ నిర్వర్తించిన సంయుక్త కార్యదర్శి బాధ్యతలు ట్రెజరర్ విశ్వరూప్ దేయ్ చేపట్టుతుండగా, మరో సం యుక్త కార్యదర్శి సుబిర్ గంగూలీ తన స్థానం లోనే కొనసాగనున్నాడు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. క్రికెట్ అభివృ ద్ధికి ఎంతో ఇష్టంతో నిరంతరం శ్రమించిన దాల్మియా మృతి క్యాబ్ కు తీరనిలోటు. క్యాబ్‌ను సమర్థవంతంగా నడిపించే సామర్థం సౌరవ్ గంగూలీకి మాత్రమే ఉన్నదని క్యాబ్ అధికారులు అభిప్రాయ పడ్డారు. ఆ మేరకే గంగూలీని దాల్మియా వారుసుడిగా ప్రకటిస్తున్నా. క్యాబ్ విషయంలో నేను జోక్యం చేసుకో వడం సరైంది కాదని తెలుసు. అయితే క్యాబ్ అధికారుల అభిమ తం మేరకే గంగూలీ నియా మకాన్ని నేను ప్రకటి స్తున్నానని తెలిపారు. ఇక దాల్మియా కుమారుడు అభిషేక్ దాల్మియాకు క్యాబ్‌లో ముఖ్య పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Comments

comments