Home జాతీయ వార్తలు జనసేనలో చేరిన మాజీ క్రికెటర్

జనసేనలో చేరిన మాజీ క్రికెటర్

Former Cricketer Venugopal Rao Joins in Janasena Party

విశాఖపట్నం : మాజీ క్రికెటర్ వేణుగోపాల్‌రావు గురువారం జనసేనలో చేరారు. జనసేన చీఫ్ , నటుడు పవన్‌కల్యాణ్ వేణుగోపాల్‌రావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2005లో వేణుగోపాల్‌రావు భారత్ తరపున శ్రీలంకతో తొలి వన్డే ఆడారు. 2006లో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడారు. 16 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశారు. జనసేన పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వేణుగోపాల్‌రావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎపిలో జన సేన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Former Cricketer Venugopal Rao Joins in Janasena Party