Home తాజా వార్తలు డిప్యూటీ కలెక్టర్‌కు కారాగార శిక్ష

డిప్యూటీ కలెక్టర్‌కు కారాగార శిక్ష

Bijayani-Biswal

భువనేశ్వర్: ఒడిసాలోని బాలంగిర్ ప్రత్యేక కోర్టు లంచం తీసుకున్న కేసులో ఓ మహిళా అధికారికి రెండు సంత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షలతో పాటు రూ. 2000 జరిమానా కూడా విధించింది. వివరాల్లోకి వెళితే… స్థానిక లోసింఘాలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన బిజయని బిస్వాల్ 2013లో ఒక భూవివాదం పరిష్కారం కోసం బాధితుల నుంచి రూ. 4000 లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ విభాగం అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు బిస్వాల్‌కు ఈ మేరకు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది. కాగా, ప్రస్తుతం బిజయని బిస్వాల్ ఒడిసాలోని కేంద్రపర జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నారు.

Former Loisingha Tehsildar Gets 2-Year Jail Term In Graft Case.