Search
Sunday 23 September 2018
  • :
  • :

తెలంగాణ సర్కార్‌ది రాచరికపు పోకడ

ponnam-prabhakarరైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి
సిఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి
మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ/కరీంనగర్: తెలంగాణ సర్కార్ అప్రజాస్వామికంగా రాచరికపు పోకడలతో పాలన కొనసాగిస్తుందని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన కరీంనగర్ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడా రు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి ఆత్మహత్యలను నివారించాలని, రైతాంగం సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు రుణాలను మాఫీ చేయాలని అసెంబ్లీలో కోరిన ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేసి ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిని అవలంబించిందని నిప్పులు చెరిగారు. శాసనసభ సమావేశాల అనంతరం కూడా కనీసం రైతుల్లో ధైర్యాన్ని నింపేదుకు ఎలాంటి ప్రయత్నం చేయని రైతు వ్యతిరేకి కెసిఆర్ అంటూ ధ్వజమెత్తారు. మరో వైపు పత్తి కొనుగోళ్లు, ఇతర పంటల మద్దతు ధరపై కేంద్రం ప్రభుత్వంపై ఆరోపణ లు చేస్తూ సహాయం చేయాలని కోరుతున్నారే తప్ప తెలంగాణ సర్కార్ రైతుల కో సం చేసిందేమిటని ప్రశ్నించారు.

ఇప్పటికైనా తెలంగాణ రైతుల పక్షాన అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించాలని కోరారు. చిత్తశుద్ధి ఉంటే మొక్కజొన్నకు రెండు వందలు, వరి ధాన్యానికి రెండువందలు, పత్తికి ఐదు వందల చ్పొప్పున బోనస్ ప్రకటించాలన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకులపై మంత్రి కెటిఆర్ స్థాయిని మరిచి విమర్శించడం తగదన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో బతుకమ్మ సంబురాల పేరుతో రోగులకు ఇబ్బంది కలిగించారని ఆరోపించిన ఎంపి తెలంగాణలో బతుకమ్మ పేరుతో పండుగను బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు. బతుకమ్మ ఆడాలంటే ఏ దైనా మైదానంలో ఆడవచ్చని కానీ ఆస్పత్రిలో ఆడి ఎందరికో ఇబ్బంది కల్గించే విధంగా ప్రవర్తించడం తప్పుపట్టారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ, పట్టణ ఆధ్యక్షుడు కర్ర రాజశేఖర్, కార్పొరేటర్ గందె మాధవి, నాయకులు కర్ణకంటి సదానందం తదితరులు పాల్గొన్నారు.

Comments

comments