Home ఖమ్మం గుమ్మడి నర్సయ్యకు గుండెపోటు

గుమ్మడి నర్సయ్యకు గుండెపోటు

MLA

ఖమ్మం: ఇల్లందు మాజీ ఎంఎల్ఎ గుమ్మడి నర్సయ్యకు శుక్రవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో  ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మం జిల్లా దవాఖానకు తరలించారు. గుమ్మడి నర్సయ్యకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. సిపిఐ(ఎంఎల్ – న్యూడెమోక్రసీ) పార్టీ తరుపున 1983లో ఇల్లందు ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. గుమ్మడి నరసయ్య ఇల్లందు నుంచి ఐదుసార్లు ఎంఎల్ఎగా గెలిచారు.