Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

గ్రామస్థులపై మాజీ ఎంఎల్‌ఎ కాల్పులు… ఒకరు మృతి

GUN

పాట్నా: బిహార్‌లోని బిక్రమ్‌గంజ్ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ఎంఎల్‌ఎ గ్రామస్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బిక్రమ్‌గంజ్ నియోజకవర్గానికి చెందిన సూర్యడియో సింగ్‌కి రోహ్‌తాస్ జిల్లాలోని టెండుని గ్రామస్థులకి మధ్య భూవివాదం తలెత్తింది.

ఈ నేపథ్యంలో సూర్యడియో కాల్పులతో విరుచుకుపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సూర్యతో పాటు భార్యను, మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సూర్య ఇంట్లో నుంచి మూడు తుపాకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గ్రామస్థులపై కాల్పులు జరిపి.. ఓ బాలిక మృతికి కారణమైన జేడీయూ మాజీ ఎమ్మెల్యే సూర్యదేవ్‌ సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు అతడి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు జేడీయూ వర్గాలు వెల్లడించాయి.

Comments

comments