Home జాతీయ వార్తలు మాజీ ఎంఎల్‌ఎ చేతిలో పేలిన తుపాకీ

మాజీ ఎంఎల్‌ఎ చేతిలో పేలిన తుపాకీ

Gun with Fireఅమరావతి: ఎపిలోని కృష్ణాజిల్లా గుడివాడ క్లబ్‌లో మాజీ ఎంఎల్‌ఎ రావి వెంకటేశ్వరరావు చేతిలో తుపాకీ పేలిన ఘటన కలకలంగా మారింది. గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు.

పోలీసులకు సమాచారం తెలియడంతో ఎంఎల్‌ఎ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా తాను కావాలని తుపాకీ పేల్చలేదని, పొరపాటుగా మిస్‌ఫైర్ అయిందని రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.