Home జాతీయ వార్తలు అబ్దుల్ కలాం స్మారక స్తూపానికి శంకుస్థాపన

అబ్దుల్ కలాం స్మారక స్తూపానికి శంకుస్థాపన

abdul kalamరామేశ్వరం: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న గ్రహీత ఎపిజె అబ్దుల్ కలాం 85వ జయంతి సందర్భంగా ఆయన స్మారక స్తూపానికి శంకుస్థాపన జరిగింది. కలాం స్వగ్రామం రామేశ్వరంలో ఈ స్తూపం ఏర్పాటు చేయనున్నారు. దీనితోపాటు నాలెడ్జ్ సెంటర్‌ను కూడా నిర్మించనున్నారు. రూ. 50కోట్ల భారీ వ్యయంతో ఈ రెండు నిర్మాణాలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా మొదటి విడతలో రూ. 15 కోట్లతో 27వేల చదరపు అడుగుల్లో స్మారక స్తూపంతోపాటు కలాం విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. దీనిని కలాం వర్ధంతి రోజైన జులై 17న ప్రారంభించనున్నారు. అలాగే రెండో విడతలో నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం చేపడతామని డిఆర్‌డిఒ అధికారులు తెలిపారు.