Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి

Suresh-Reddy

హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సురేష్ రెడ్డితో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టిఆర్‌ఎస్‌లోకి ఆయనను ఆహ్వానించామని కెటిఆర్ తెలిపారు. టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సురేష్ రెడ్డి అంగీకరించారని, ఆయనకు టిఆర్‌ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఒక మంచి మార్గంలో వెళ్తోందని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నానని సురేష్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే టిఆర్‌ఎస్ అనుభవం అవసరముందన్నారు. తెలంగాణకు కెసిఆర్ దిశ, దశ చూపించారని కొనియాడారు. కెసిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటామని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం టిఆర్ఎస్ లో చేరడం లేదని పేర్కొన్నారు.

Comments

comments